News December 30, 2024

నేడు పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు నేడు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నిర్వహించే ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానిస్తామని రాజు తెలిపారు. పవన్ డేట్స్ అడ్జస్ట్‌మెంట్ ఆధారంగానే ఈవెంట్‌ తేదీని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కాగా.. విజయవాడలో చెర్రీ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన <<15010361>>256 అడుగుల భారీ కటౌట్<<>> వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆ అవార్డు దిల్ రాజు అందుకున్నారు.

Similar News

News January 20, 2026

పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

image

వ్యాక్సిన్లు ఇవ్వడం అనేది పిల్లలను కేవలం వ్యక్తిగత వ్యాధుల నుంచి రక్షించడమే కాక Herd Immunityని పెంచుతుందంటున్నారు నిపుణులు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణ, ఇమ్యునిటీ పెరగడం వల్ల అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తుంది. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

News January 20, 2026

వెండి భగభగలు.. కారణమిదే!

image

వెండి ధరలు ఆకాశాన్ని తాకడానికి చైనా నిర్ణయాలే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ వెండి సరఫరాలో ఆధిపత్యం ఉన్న చైనా తన క్లీన్ ఎనర్జీ (సోలార్, EV) అవసరాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికి తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువ తగ్గడం, పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం KG వెండి ధర ₹3.40లక్షలు ఉండగా త్వరలోనే రూ.4లక్షలు క్రాస్ చేస్తుందని అంచనా.

News January 20, 2026

విద్యార్థులు రోగాల బారిన పడకుండా కమిటీలు

image

AP: హాస్టళ్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా 9 శాఖల అధికారులతో జిల్లాల్లో JACలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైద్య, ఫుడ్‌ సేఫ్టీ, పంచాయతీ, మున్సిపల్, పశు సంవర్ధక, వ్యవసాయ, సంక్షేమ‌, గ్రామీణ నీటి పారుదల, విద్యా శాఖల అధికారులతో వీటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కాగా JACల తనిఖీలు నివేదికలకే పరిమితం కారాదని, లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.