News December 30, 2024
నేడు పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ
AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు నేడు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నిర్వహించే ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానిస్తామని రాజు తెలిపారు. పవన్ డేట్స్ అడ్జస్ట్‌మెంట్ ఆధారంగానే ఈవెంట్ తేదీని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కాగా.. విజయవాడలో చెర్రీ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన <<15010361>>256 అడుగుల భారీ కటౌట్<<>> వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆ అవార్డు దిల్ రాజు అందుకున్నారు.
Similar News
News January 19, 2025
LSG కెప్టెన్‌గా పంత్!
IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్‌లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్‌లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.
News January 19, 2025
తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది: షా
AP: విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు చర్చించి, కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు. ‘హైందవ శంఖారావం’ విజయం పట్ల VHP, BJP నేతలను షా అభినందించారు.
News January 19, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్‌ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.