News February 4, 2025

ముగిసిన దిల్ రాజు విచారణ

image

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విచారణ ముగిసింది. ఆయన బ్యానర్ నుంచి రిలీజైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు సంబంధించిన బిజినెస్ అకౌంట్స్ వివరాలు అడిగినట్లు సమాచారం. రెండు గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు.

Similar News

News February 19, 2025

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.

News February 19, 2025

సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

image

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.

News February 19, 2025

ఆ సంఘటన తర్వాత మారిపోయా: హీరోయిన్

image

తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.

error: Content is protected !!