News October 8, 2024
వారికి నేరుగా ఇంటర్లో ప్రవేశాలు: మంత్రి పొన్నం
TG: గురుకులాల్లో పదో తరగతి పాసైన విద్యార్థులకు నేరుగా ఇంటర్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై విద్యాశాఖకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేవారిమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాల్లో పది పాసైనా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. గురుకులాల్లో 8వ తరగతి నుంచే NCC, NSS, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
Similar News
News November 10, 2024
ఆస్ట్రేలియా చెత్త రికార్డు
పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.
News November 10, 2024
కెనడాలో టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ!
కెనడాలో ఓ టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపింది. రోగితో కాంటాక్ట్‌లో ఉన్న వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కాగా ఈ బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ, డైరీ ఫామ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల USలో పలువురు కార్మికులకు సోకింది. అయితే ఈ ఫ్లూ ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుందనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
News November 10, 2024
జస్ట్ 3 ఇయర్స్! కొత్తగా లక్ష మంది కోటీశ్వరులు
దేశంలో రూ.కోటికి పైగా ట్యాక్సబుల్ ఇన్‌కం దాటినవాళ్ల సంఖ్య 2.20 లక్షలు దాటేసింది. పదేళ్లలోనే వీరు 5 రెట్లు పెరిగారు. గత మూడేళ్లలోనే ఈ జాబితాలో లక్షమంది చేరడం విశేషం. కొవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి. చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బు ఆర్జిస్తున్నారు. భారీగా డివిడెండ్స్ పొందుతున్నారు. ఇక ప్రతిభావంతులకు కంపెనీలు ఎంత ప్యాకేజీ ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. మరోవైపు ITలో సంస్కరణలు రావడం ఇందుకు ఓ కారణం.