News April 16, 2025
ట్రంప్‌కు యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశా: డైరెక్టర్

ట్రంప్ నిర్ణయాలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవేళ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్ కొలంబస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిత్రం హోమ్ ఎలోన్-2లో ట్రంప్‌కు కెమియో రోల్ ఇచ్చి తప్పుచేశానని అన్నారు. ట్రంప్ సీన్ కట్ చేయాలని ఉన్నా చేయలేనని, చేస్తే తనను దేశ బహిష్కరణ చేస్తారని అప్పుడు వేరే దేశంలో ఉండాలని అన్నారు. కాగా గతంలో తనను హోమ్ ఎలోన్-2లో నటించమని డైరెక్టర్ బతిమాలాడని ట్రంప్ అన్నారు.
Similar News
News September 13, 2025
ఈనెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

TG: దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.
News September 13, 2025
భారత్‌పై సుంకాలు విధించాలని G7, EUకి US రిక్వెస్ట్!

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్, చైనాపై సుంకాలు విధించాలని G7 దేశాలు, EUను US కోరినట్లు రాయిటర్స్ తెలిపింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ల మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో దీనిపై చర్చ జరిగినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్‌ను వినియోగించుకుని, ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకూ అంగీకరించారని వెల్లడించింది.
News September 13, 2025
రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం!

నైరుతి రుతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని IMD అంచనా వేసింది. జూన్ 1న కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 8వ తేదీకల్లా అంతటికీ విస్తరించాయి. ఈ సీజన్‌లో 77.86CM వర్షం కురవాల్సి ఉండగా 83.62CM వర్షపాతం నమోదైంది. వాయవ్య భారతంలో సాధారణం(53.81CM) కంటే 34 శాతం, దక్షిణాదిన రెగ్యులర్(61CM) కంటే 7 శాతం అధిక వర్షపాతం నమోదైందని IMD వెల్లడించింది.