News August 7, 2024
రవితేజ ఫ్యాన్స్కు నిరాశ.. ఆ ఈవెంట్ రద్దు

రవితేజ ఫ్యాన్స్కు ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు సాయంత్రం 5గంటలకు ‘ఏఏఏ సినిమాస్’లో ట్రైలర్ లాంచ్ ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిర్మాణ సంస్థ ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని కారణాల రీత్యా ఆ ఈవెంట్ రద్దైందని తాజాగా తెలిపింది. ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పింది. ఇక ట్రైలర్ విడుదల అదే సమయానికి ఉండనుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News December 24, 2025
తాడేపల్లి: పవన్ రాక.. నాగేశ్వరమ్మ సంతోషానికి హద్దులు లేవు.!

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ రాకతో ఇండ్ల నాగేశ్వరమ్మ సంతోషం ఆకాశాన్ని తాకింది. ఇచ్చిన మాట ప్రకారం జనసేన అధినేత వస్తున్నాడని సమాచారంతో బుధవారం ఆమె ఇప్పటం గ్రామంలోని తన ఇంటిని పార్టీ జెండాలతో అలంకరణ చేసి, పుష్పాలతో స్వాగతం పలికారు. బంగారు కొండని సంబోధిస్తూ ఎంతో ఆప్యాయంగా పవన్ను ఆహ్వానించారు. పవన్ తన జీతం నుంచి రూ.5వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో ఇస్తానని హామీ ఇవ్వడంతో నాగేశ్వరమ్మ ఎమోషనల్ అయ్యారు.
News December 24, 2025
కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల(గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా యానిమల్(రూ.917 కోట్లు)ను బీట్ చేసి 9వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి రికార్డులు బ్రేకవడం గ్యారంటీ.
News December 24, 2025
కన్నప్రేమ నేర్పిన నాయకత్వం: సత్య నాదెళ్ల విజయ రహస్యం

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నాయకత్వ శైలి మారడానికి ఆయన పిల్లలే ప్రధాన కారణం. పుట్టుకతోనే ప్రత్యేక అవసరాలున్న తన పిల్లలను చూశాక లోకాన్ని చూసే కోణం మారిందన్నారు ఆయన ఓ సందర్భంలో. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం నాయకుడికి ఉండాలని గ్రహించారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి సాంకేతికత అందాలనే లక్ష్యంతో పనిచేశారు. తన పిల్లల వల్ల కలిగిన ఈ అనుభవాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి.


