News August 7, 2024
రవితేజ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఆ ఈవెంట్ రద్దు
రవితేజ ఫ్యాన్స్‌కు ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు సాయంత్రం 5గంటలకు ‘ఏఏఏ సినిమాస్’లో ట్రైలర్ లాంచ్ ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిర్మాణ సంస్థ ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని కారణాల రీత్యా ఆ ఈవెంట్ రద్దైందని తాజాగా తెలిపింది. ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పింది. ఇక ట్రైలర్ విడుదల అదే సమయానికి ఉండనుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News December 12, 2024
‘పుష్ప-2’: రేవతి మృతికి బాధ్యులెవరు?
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో <<14796361>>రేవతి<<>> చనిపోగా ఆమె కొడుకు గాయపడిన విషయం తెలిసిందే. రేవతి మృతితో తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం అల్లు అర్జున్ కూడా ఇదే కారణం చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం తను వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందనడం సరికాదని, తనపై కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. మరి ఈ ఘటనకు బాధ్యులెవరు?
News December 12, 2024
మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు
నటుడు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. TV9 రిపోర్టర్‌పై దాడి చేసినందుకు నిన్న ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేసిన పోలీసులు ఇవాళ దాన్ని మార్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మరోవైపు ఘర్షణలో గాయపడ్డ మోహన్‌బాబు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News December 12, 2024
ఈ నెల 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
TG: ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనలో 350 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్‌లో తెలంగాణ వంటకాలతోపాటు ఇరానీ చాయ్, బిర్యానీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రదర్శనను సీఎం రేవంత్‌తోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు.