News November 30, 2024
నేడు పింఛన్ల పంపిణీ
AP: రేపు(ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. CBN ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు.
Similar News
News November 30, 2024
బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య బీమా?
APలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందుతోంది. వీరికి ఆరోగ్య బీమా పథకాన్ని(EHS) జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కోసం ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఉద్యోగి దాదాపు ₹7వేలు చెల్లిస్తున్నారు. అయితే రెండు జాతీయ బ్యాంకుల ప్రీమియం ₹2,500 మాత్రమే ఉంది. దీంతో ఈ విధానం అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
News November 30, 2024
GOOD NEWS.. రూ.2 లక్షల రుణమాఫీ!
రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు శుభవార్త. నేడు పాలమూరులో నిర్వహించే రైతు సదస్సులో CM రేవంత్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3వేల కోట్లు విడుదల చేయనుంది. DEC మొదటి వారంలో జీతాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ కాగా.. పలు కారణాలతో 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదు.
News November 30, 2024
ప్రత్యర్థులు మిస్ అవ్వరు అనుకుంటున్నా: KTR
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని రోజులు హైదరాబాద్‌ను వీడనున్నారు. కొంత కాలం వెల్‌నెస్ రీట్రీట్‌కు వెళ్లనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ‘నేను తిరిగి వచ్చేవరకూ నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మిస్ అవ్వరు అనుకుంటున్నా’ అని సెటైర్లు వేశారు.