News August 30, 2024
నిలిచిపోయిన ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవలు
అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం 6 గం. వరకు అందుబాటులో ఉండవని కేంద్రం తెలిపింది. ఆన్‌లైన్ పోర్టల్ అప్‌డేట్ వల్ల ఈ అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది. ఈ సమయంలో కొత్త అపాయింట్‌మెంట్లు షెడ్యూల్ కావని చెప్పింది. నేటి అపాయింట్‌మెంట్ల రీషెడ్యూల్ విషయాన్ని దరఖాస్తుదారులకు మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇచ్చినట్లు HYD ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం తెలిపింది.
Similar News
News September 9, 2024
సీఎం చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
AP: 2014-19 మధ్య CM చంద్రబాబు పర్సనల్ సెకట్రరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో పెండ్యాలదే కీలక పాత్ర అని సీఐడీ నోటీసులివ్వడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. దీంతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
News September 9, 2024
సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
TG: రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకరించాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇరుకు రహదారులతో పీక్ అవర్స్‌లో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
News September 9, 2024
సలార్-2లో మోహన్ లాల్?
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్‌బస్టర్ అవడంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం మోహన్ లాల్‌ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి నటిస్తున్న విషయం తెలిసిందే.