News June 3, 2024
మూవీ థియేటర్‌లో వివక్ష.. సంచార జాతి వారికి టికెట్లివ్వని వైనం
సంచార జాతివారికి సినిమా థియేటర్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపిన ఘటన తమిళనాడులో జరిగింది. 30మంది సంచార జాతి వారు కడలూర్(D)లో వంట పాత్రలు అమ్మేందుకు వచ్చారు. కడలూర్‌లోని ఓ థియేటర్‌కు వీరంతా సినిమా చూసేందుకు వెళ్ళగా యాజమాన్యం టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో వారు RDOకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ వారిని థియేటర్‌కు తీసుకెళ్లి సొంత డబ్బుతో మూవీ చూపించారు. యాజమాన్యంపై చర్యలకు కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 9, 2024
TODAY HEADLINES
➣AP: బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం: CBN
➣AP: అతి భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
➣TG: జర్నలిస్టులకు భూమి పత్రాలు అందించిన CM రేవంత్
➣బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్
➣పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చిన CBN: కురసాల
➣TG:కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం: హైడ్రా కమిషనర్
➣ ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో పేదల ఇళ్లు: KTR
➣31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్
News September 8, 2024
రికార్డు ధర పలికిన గణేశ్ లడ్డూ
AP: దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరులో గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. మాగుంట లే అవుట్‌లో ఏర్పాటు చేసిన మండపంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా, పోటాపోటీలో చివరకు రూ.8.01 లక్షలు పలికింది. తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాసులు రెడ్డి లడ్డూని వేలంలో దక్కించుకున్నారు.
News September 8, 2024
ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు.. ఘాట్ రోడ్లపై రాకపోకలు నిషేధం
AP: అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న హెచ్చరికలతో కలెక్టర్ దినేశ్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, గెడ్డలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. వాహనదారులు ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో నర్సీపట్నం-సీలేరు, వడ్డాది-పాడేరు, అరకు-అనంతగిరి, రంపచోడవరం-మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను నిషేధించారు.