News August 7, 2024

క్యాబినెట్‌లో కీలక అంశాలపై చర్చ?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణంపై అనుసరించాల్సిన ప్రణాళిక, సాగునీటి ప్రాజెక్టులు, సిబ్బంది బదిలీలపై చర్చ సాగుతున్నట్లు సమాచారం. మరికాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Similar News

News December 10, 2024

మందస వద్ద పులి అడుగు జాడలు

image

పలాస నియోజకవర్గం మందస మండలం చీపి ప్రాంతంలో పులి అడుగు జాడలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఈ అడుగులు ఉన్నట్లు గమనించారు. ఇటీవలే ఒడిశా ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి పులి ప్రవేశించిందంటూ ఒడిశా అధికారులు, స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

News December 10, 2024

BREAKING: మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత

image

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ(92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎం, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

News December 10, 2024

MBUలో ఆర్థిక అవకతవకలు: మనోజ్

image

TG: తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని మనోజ్ అన్నారు. ‘కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబం దూరంగా ఉంటోంది. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. అందులోని బాధితులకు నేను అండగా ఉన్నాను. అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని మనోజ్ అన్నారు. మనోజ్ రాసిన లెటర్ pdf కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.