News March 17, 2024
టీడీపీ సభలో మోదీకి అవమానం: మాజీ మంత్రి

AP: చిలకలూరిపేటలో ఇవాళ జరిగిన TDP-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘ఈ సభలో ప్రధాని మోదీకి అవమానం జరిగింది. మైక్ మూగబోవడంతో ఆయన బొమ్మలా నిలబడ్డారు. సభ జరుపుకోవడం చేతకానివారు జగన్‌పై యుద్ధం అంటున్నారు. లోపాయికారి ఒప్పందం చేసుకున్న మీకు ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు.
Similar News
News February 3, 2026
ఆస్టియోపోరోసిస్ ముప్పు వారికే ఎక్కువ

మెనోపాజ్‌దశలో ఆడవాళ్లకు ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సంతానసంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ మరింత ఎక్కువని ఫెర్టిలిటీ&స్టెరిలిటీ జర్నల్‌లోని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో సంతానలేమి, గర్భస్రావం జరగటం, మృత శిశువు జన్మించటం వంటివి జరిగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ముప్పు 16శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
News February 3, 2026
శుక్రవారమే సినిమా రిలీజ్‌లు ఎందుకో తెలుసా?

* శని, ఆదివారాల్లో సెలవు కావడం
* కొన్నేళ్ల క్రితం శుక్రవారం పేమెంట్స్ ఇచ్చేవారు. ఆ రోజు విడుదల చేస్తే ఫ్యామిలీస్‌తో సినిమాలకు వస్తారని భావించడం.
* 1939, DEC 15 (శుక్రవారం)న ‘Gone with the Wind’ సినిమా విడుదలై భారీ విజయం సాధించడం
* 1960, AUG 5 శుక్రవారమే విడుదలైన ‘Mughal-e-Azam’ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం
– చాలాకాలం నుంచి అదే ట్రెండ్ సౌత్‌లోనూ కొనసాగినా ఇటీవల గురువారం విడుదల చేస్తున్నారు.
News February 3, 2026
మద్యం అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు: పవన్

AP: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి’ అని స్పష్టం చేశారు. నిరంతర నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.


