News March 17, 2024

టీడీపీ సభలో మోదీకి అవమానం: మాజీ మంత్రి

image

AP: చిలకలూరిపేటలో ఇవాళ జరిగిన TDP-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘ఈ సభలో ప్రధాని మోదీకి అవమానం జరిగింది. మైక్ మూగబోవడంతో ఆయన బొమ్మలా నిలబడ్డారు. సభ జరుపుకోవడం చేతకానివారు జగన్‌పై యుద్ధం అంటున్నారు. లోపాయికారి ఒప్పందం చేసుకున్న మీకు ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు.

Similar News

News March 14, 2026

రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR

image

TG: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. BRS హయాంలో చేపట్టిన మూసీ అభివృద్ధిపై HYD హిమాయత్ సాగర్‌ వద్ద ఆయన PPT ఇచ్చారు. రానున్న రెండేళ్లు కాంగ్రెస్ బుల్డోజర్ ప్రభుత్వంపై పోరాటానికి మూసీ బాధితులంతా తమకు అండగా ఉండాలని కోరారు. HYDలో మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

News March 14, 2026

భట్టి ఇంటికి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇటీవల భట్టి కుమారుడి వివాహం జరగగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ప్రజాభవన్‌కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని శిరీష్-నయనిక దంపతులకు విషెస్ తెలిపారు. ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News March 14, 2026

కమల్‌ హాసన్‌పై చిన్మయి తీవ్ర విమర్శలు

image

తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేసిన కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి మండిపడ్డారు. ‘ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఆయన అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి’ అని సూచించారు. కాగా గతంలో వైరముత్తు తనను వేధించాడని చిన్మయి తరచూ ఆరోపిస్తూ వస్తున్నారు.