News March 16, 2024
అసంతృప్తితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవేంద్ర

బీజేపీలో కష్టపడి పని చేసిన పార్టీ అధిష్ఠానం గుర్తించడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. శనివారంలోని నరసింహారెడ్డి నగర్‌లో ఆయన జన్మదిన వేడుకలు అనంతరం బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్‌కు పోటీ చేయాలంటూ రాఘవేంద్రపై వర్గం ఒత్తిడి తీసుకువచ్చింది.
Similar News
News February 4, 2026
కర్నూలు: ఒక్క రోజులోనే రూ.2,717 పెరిగిన ధర

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరశనగ ధర మళ్లీ పెరిగింది. మంగళవారం క్వింటా గరిష్ఠ ధర రూ.9,207 పలికింది. సోమవారం భారీగా పడిపోయి క్వింటా గరిష్ఠ ధర రూ.6,490 మాత్రమే పలికింది. ఒక్క రోజులోనే రూ.2,717 పెరగడంతో రైతులు కాస్త ఊరట చెందారు. నిన్న మధ్యస్థ ధర రూ.7,600, కనిష్ఠ ధర రూ.3,636కు వ్యాపారులు కొనుగోలు చేశారు. మొత్తం 2,918 బస్తాలు మార్కెట్‌కు వచ్చాయి.
News February 3, 2026
కర్నూలు: పరీక్షలకు 238 మంది విద్యార్థులు గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా 72 పరీక్షా కేంద్రాలలో మంగళవారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మూడవరోజు ముగిశాయి. వివరాలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 4,330 మంది విద్యార్థులు హాజరవ్వగా, 168 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 3,538 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 74 మంది గైర్హాజరయ్యారన్నారు.
News February 3, 2026
1930 నంబర్ గురించి తెలుసుకోండి!

ఆన్‌లైన్, బ్యాంక్, OTP, UPI/ATM/క్రెడిట్ కార్డు స్కామ్‌లు జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ కావడంతో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోసానికి గురైనప్పుడు 1930కి కాల్ చేస్తే బ్యాంక్‌కు అలర్ట్ పంపిస్తారు. https://cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు.


