News October 28, 2024

10 మంది స్పెషల్ పోలీసుల డిస్మిస్

image

TG: పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని <<14463743>>సస్పెండ్<<>> చేసిన అధికారులు వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Similar News

News October 28, 2024

నెలకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్

image

TG: దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. పెంచిన పెన్షన్‌ను 2024 జనవరి నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ హామీ అమలు కోసం త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటించింది.

News October 28, 2024

ఒక్క DAపై ఉద్యోగుల్లో అసంతృప్తి

image

TG: పెండింగ్‌లో ఉన్న 5 DAల్లో ఒక్కటి మాత్రమే ప్రభుత్వం ఇస్తామని చెప్పడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది తమను నిరాశకు గురిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం లైట్ తీసుకుందని, సంఘాలు సైతం పోరాడలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

News October 28, 2024

NOV 6న క్యాబినెట్ భేటీ.. పూర్తిస్థాయి బడ్జెట్‌పై నిర్ణయం?

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 6న క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించేందుకు ప్రతిపాదనలను నవంబర్ 4వ తేదీ సా.4 గంటలలోపు పంపాలని అన్ని శాఖలను CS నీరబ్ ఆదేశించారు. ఈ భేటీలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్‌తో ముగియనుంది.