News November 11, 2024

ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. పలువురు మహిళలపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో వీడియోలు బయటికొచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మేలో అరెస్ట్ చేశారు.

Similar News

News December 11, 2024

బియ్యం అక్రమాలపై అవసరమైతే పీడీ యాక్టు: CBN

image

AP: బియ్యం స్మగ్లింగ్ వంటి అక్రమ చర్యలను నియంత్రించేందుకు అవసరమైతే పీడీ యాక్టును వాడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ రైస్ తినని వారికి ప్రత్యామ్నాయం చూసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News December 11, 2024

‘పుష్ప-2’ మూవీ చూసి వ్యక్తి చెవి కొరికేశాడు!

image

సినిమా నుంచి మంచి నేర్చుకోవడం కంటే, చెడు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గ్వాలియర్‌లోని(MP) కాజల్ టాకీస్‌లో ‘పుష్ప-2’ సినిమా చూసేందుకు వచ్చిన షబ్బీర్‌తో క్యాంటిన్ సిబ్బంది గొడవకు దిగారు. వాగ్వాదం పెరగడంతో సినిమాలో అల్లు అర్జున్ ఫైటింగ్‌ చేస్తూ ప్రత్యర్థుల చెవిని కొరికినట్లు.. షబ్బీర్‌ చెవిని ఒకరు కొరికేశాడు. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 11, 2024

రూ.1,000 కోట్లు దాటేసిన ‘పుష్ప-2’

image

బాక్సాఫీసుపై అల్లు అర్జున్ ‘పుష్ప-2’ దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,002 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. బాక్సాఫీసు వద్ద సరికొత్త చరిత్రను లిఖించిందని పేర్కొంది. దీంతో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచిందని వెల్లడించింది. కమర్షియల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ కొత్త అర్థం చెప్పారని పేర్కొంది.