News December 4, 2024

పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత

image

TG: లగచర్ల ఘటనలో A1గా ఉన్న కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కొడంగల్ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

Similar News

News January 14, 2025

సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం: సీఎం

image

AP: రాష్ట్రంలో సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని, రానున్న రోజుల్లో మరింత ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నారావారిపల్లెలో మాట్లాడుతూ ‘ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర వస్తోంది. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెరిగింది. తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే అవకాశం వచ్చింది’ అని తెలిపారు.

News January 14, 2025

భారీగా ప‌త‌న‌మైన HCL స్టాక్స్

image

Q3 ఫ‌లితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ దేశంలో మూడో అతిపెద్ద‌ IT దిగ్గ‌జం HCL Technologies షేర్లు మంగ‌ళ‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. గ‌త సెష‌న్‌లో స్థిర‌ప‌డిన ₹1,975 నుంచి ₹1,819 వ‌ర‌కు 8.52% మేర ప‌త‌న‌మ‌య్యాయి. Q3లో ₹4,591 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన సంస్థ‌ గత క్వార్టర్ కంటే 8.5% వృద్ధిని నమోదు చేసింది. ఫ‌లితాలు ఆశించిన మేర లేక‌పోవ‌డం, కంపెనీ ఫ్యూచ‌ర్‌ ప్లాన్స్ కూడా ఇన్వెస్ట‌ర్ల‌ను మెప్పించ‌లేక‌పోయాయి.

News January 14, 2025

ఇంగ్లండ్ సిరీసుకు టీమ్ సైజ్ తగ్గించండి: గవాస్కర్

image

ఇంగ్లండ్ టెస్టు సిరీసుకు టీమ్ సైజును తగ్గించాలని టీమ్ఇండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. 16 కన్నా ఎక్కువ మందిని ఎంపిక చేయడం సెలక్టర్ల అపనమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ఆసీస్‌కు 19 మందిని పంపించడం తెలిసిందే. ఎక్కువ మందిని పంపే స్తోమత BCCIకి ఉన్నా టీమ్ఇండియా క్యాప్‌ ఈజీగా ఇచ్చేయొచ్చని కాదన్నారు. విదేశాల్లో ప్రాక్టీస్ మ్యాచులు ఎక్కువ ఆడాలని, ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ తీసేయాలని చెప్పారు.