News August 1, 2024

శ్రీకృష్ణ జన్మభూమిపై ముస్లిం సంఘాల పిటిషన్ కొట్టివేత

image

శ్రీకృష్ణ జన్మభూమిపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం పిటిషన్ వేయగా, ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు హిందూ సంఘాల పిటిషన్‌పై విచారణ కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది.

Similar News

News November 16, 2025

నా వర్క్‌కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

image

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటో‌షూట్‌ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్‌లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్‌కు పర్సనల్ నంబర్‌ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

image

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్‌లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.

News November 16, 2025

ప్రభుత్వం విఫలం.. క్వింటాల్‌కు ₹2వేల నష్టం: KTR

image

TG: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘ప్రస్తుతం క్వింటాల్‌కు ₹8,110 కనీస మద్దతు ధర ఉంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో రైతులకు ₹6,000-7,000 మాత్రమే దక్కుతోంది. రైతులు క్వింటాల్‌పై ₹2,000 వరకు నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న పత్తిని కొనకుండా CCI కఠినంగా వ్యవహరిస్తోంది’ అని ఫైరయ్యారు.