News August 1, 2024

శ్రీకృష్ణ జన్మభూమిపై ముస్లిం సంఘాల పిటిషన్ కొట్టివేత

image

శ్రీకృష్ణ జన్మభూమిపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం పిటిషన్ వేయగా, ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు హిందూ సంఘాల పిటిషన్‌పై విచారణ కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది.

Similar News

News October 12, 2024

‘దసరా’ పూజకు సరైన సమయమిదే..

image

విజయదశమి రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందుకాలాన్ని విజయ ముహూర్తంగా చెబుతారు. ఆ సమయంలో శమీవృక్షా(జమ్మిచెట్టు)న్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని ‘అగ్నిగర్భ’ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం. దీనికే ‘శివా’ అనే మరో పేరుంది. అంటే సర్వశుభకరమైనదని. ‘మహాభారతం’ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు.

News October 12, 2024

కాలేజీలు బంద్ చేస్తే చర్యలు: రిజిస్ట్రార్ హెచ్చరిక

image

TG: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తే చర్యలు తప్పవని OU రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని పలు కాలేజీల యాజమాన్యాలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించడంతో ఆయన స్పందించారు. డిగ్రీ, పీజీ అకడమిక్ సెమిస్టర్ పరీక్షలు, గ్రూప్-1,2,3 ఉద్యోగాలు, ఇతర రాత పరీక్షలు ఉన్నందున కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారని చెప్పారు.

News October 12, 2024

టాటా ట్రస్ట్స్ కొత్త ఛైర్మన్ నేపథ్యం ఇదీ..

image

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా ఎంపికైన నోయల్ టాటా రతన్ టాటా సవతి తల్లి కొడుకు. రతన్ తండ్రి నావల్ హెచ్ టాటా తొలుత సూనూ కమిశారియ‌ట్‌ను పెళ్లాడారు. వీరికి రతన్, జిమ్మీ జన్మించారు. ఆ తర్వాత నావల్ సిమోన్ హెచ్ టాటాను వివాహమాడగా వారికి నోయల్ పుట్టారు. రతన్, జిమ్మీ ఇద్దరూ అవివాహితులే. నోయల్ భార్య ఆలూ మిస్త్రీ షాపూర్‌జీ పల్లోంజీ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమార్తెనే. సైరస్ మిస్త్రీకి స్వయానా సోదరి.