News November 29, 2024
రిషితేశ్వరి కేసు కొట్టివేత
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు.
Similar News
News November 29, 2024
హిందువులపై దాడులు మీడియా సృష్టి కాదు: భారత్
బంగ్లాలో హిందువులపై దాడి మీడియా సృష్టి కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ‘హిందువులే లక్ష్యంగా బంగ్లాలో జరుగుతున్న దాడుల గురించి భారత్ క్రమం తప్పకుండా ఆ దేశ ప్రభుత్వం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. హింసాత్మక దాడులు, హిందువులపై ఉగ్రముద్రను మీడియా ఊహగానాలుగా కొట్టిపారేయకూడదు. మైనారిటీలను రక్షించాలని బంగ్లాకు స్పష్టం చేశాం’ అని తెలిపారు.
News November 29, 2024
48వేల ఫొటోల్లో ‘ది బెస్ట్’ ఇదే!
ఏంటీ చిట్టెలుకలు గొడవపడుతున్న ఫొటోను పెట్టారు అనుకుంటున్నారా? ఇది మామూలు ఫొటో కాదండోయ్. 2019 వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ LUMIX పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. లండన్‌లోని ఓ అండర్‌గ్రౌండ్ సబ్ వేలో ఎలుకలు పోరాడుతుండగా ఫొటోగ్రాఫర్ సామ్ రౌలీ ఫొటో తీశారు. ఈ పోటీలో మొత్తం 48,000 కంటే ఎక్కువ ఫొటోలు సమర్పించగా దీనికి అంతా జై కొట్టారు. తాజాగా ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
News November 29, 2024
ఛాంపియన్స్ ట్రోఫీపై ICC సమావేశం వాయిదా
ఛాంపియన్స్ ట్రోఫీపై ICC కీలక సమావేశం శనివారానికి వాయిదా పడింది. జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆతిథ్య పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో కొనసాగించినా భారత మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో తటస్థ వేదికలపై నిర్వహించాలని BCCI కోరింది. ఈ విషయాన్ని తేల్చడానికి ICC తలపెట్టిన కీలక సమావేశం అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది.