News June 15, 2024
చైనాతో వివాదం.. నష్టపోతున్న ఎలక్ట్రానిక్స్ రంగం?
చైనాతో దౌత్య సంబంధాలు క్షీణించడంతో భారత్‌లోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం నష్టపోతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగేళ్లలో లక్ష ఉద్యోగాలు పోగా, $15 బిలియన్ల ప్రొడక్షన్ లాస్ వచ్చిందని వెల్లడించాయి. దాదాపు 5వేల మంది చైనా ఎగ్జిక్యూటివ్‌ల వీసా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ ప్రభావం వ్యాపార విస్తరణపై పడుతోందని తెలిపాయి. సాధారణ పరిస్థితులు ఉండుంటే భారతీయ సంస్థలకు 23% వరకు వృద్ధి ఉండేదట.
Similar News
News September 12, 2024
స్టాక్ మార్కెట్ల జోష్‌కు కారణాలివే
* US CPI డేటా అంచనాలను మించి మెరుగ్గా ఉండటం * US ఫెడ్ వడ్డీరేట్లను 200 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తుందన్న అంచనాలు * 2026 ఆగస్టు నాటికి ఆర్బీఐ రెపోరేటును 4 సార్లు తగ్గిస్తుందన్న అంచనాలు * క్రూడాయిల్ ధరలు మూడేళ్ల కనిష్ఠానికి చేరడం, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ సగటు ధర 70 డాలర్లే * బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్, ఆటో, మెటల్ షేర్లలో ర్యాలీ * బూస్ట్ ఇచ్చిన FIIలు, పాజిటివ్ సెంటిమెంట్ * డాలర్ సూచీ బలహీనత
News September 12, 2024
BREAKING: సీతారాం ఏచూరి కన్నుమూత
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్ను మూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1992 నుంచి ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
News September 12, 2024
మదనపల్లె తహశీల్దార్ ఆఫీసులో సీఐడీ తనిఖీలు
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఇవాళ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. కోళ్లబైలు పరిధిలోని ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.