News September 17, 2024

జియో సేవల్లో అంతరాయం

image

ప్రముఖ టెలికం కంపెనీ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్ సరిగా రాకపోవడంతో కాల్స్ కలవడం లేదని యూజర్లు సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు. ముంబైలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్‌లోనూ కాల్స్ కలుస్తున్నా వాయిస్ కట్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.

Similar News

News November 9, 2025

హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్‌ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్‌లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

News November 9, 2025

రిజల్ట్ తెలిసే KCR ప్రచారం చేయలేదు: రేవంత్

image

జూబ్లీహిల్స్‌లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని KTR చేసిన విమర్శలపై రేవంత్ స్పందించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టే జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇతర చోట్ల ఉపఎన్నికలు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశానన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపుపై KCRకు నమ్మకం లేదన్నారు. అందుకే సునీతను గెలిపించాలని కనీసం ప్రకటనైనా విడుదల చేయలేదని కౌంటర్ వేశారు.

News November 9, 2025

మంచి మనసు చాటుకున్న శ్రీచరణి

image

వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె ట్రైనింగ్ పొందిన కడప క్రికెట్ అకాడమీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీచరణిని అభినందిస్తూ కడప టీడీపీ అధ్యక్షుడు, కమలాపురం MLA రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వాటిని అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న అండర్-14 క్రికెట్ టీమ్ ప్రోత్సాహానికి కేటాయించాలని శ్రీచరణి కోరారు.