News September 13, 2025
ఈనెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

TG: దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News September 13, 2025
బీసీసీఐలో భజ్జీకి కీలక పదవి?

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్‌కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.
News September 13, 2025
ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.
News September 13, 2025
ఈమె తల్లి కాదు.. రాక్షసి

TG: ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్(D) శభాష్‌పల్లికి చెందిన మమతకు భాస్కర్‌తో వివాహం కాగా పిల్లలు చరణ్(4), తనుశ్రీ(2) ఉన్నారు. భాస్కర్‌తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.