News September 3, 2024

వరద బాధితులకు ఔషధాల పంపిణీ

image

AP: భారీ వర్షాలు, వరదలకు ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. బాధితులకు 75వేల ఎమర్జెన్సీ మందుల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కిట్లలో పారాసిటమాల్, లివో సిట్రెజిన్, డొమిపేరిడోన్, పురోక్సిన్, ORS ప్యాకెట్లు ఉన్నట్లు చెప్పారు. తొలి విడతగా 10వేల కిట్లను అందించినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని వైద్య శిబిరాల్లోనూ ఈ కిట్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

Similar News

News September 13, 2024

‘దేవర’కు అరుదైన ఘనత

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమాకు అరుదైన ఘనత లభించింది. లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్‌లో ఈ మూవీ ప్రదర్శించనున్నారు. ఈనెల 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్‌లో షో వేయనున్నారు. ఈ విషయాన్ని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రీమియర్‌ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు తెలిపాయి. హాలీవుడ్ సెలబ్రిటీలూ ‘దేవర’ చూడనున్నట్లు సమాచారం.

News September 13, 2024

ఊరట ఓకే.. సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌‌కు వెళ్లలేని కేజ్రీవాల్

image

<<14090235>>బెయిల్‌పై<<>> బయటకొస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు పెట్టిన కండీషన్లే ఇక్కడా వర్తిస్తాయని చెప్పడమే ఇందుకు కారణం. దీంతో ఆయన సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌కు వెళ్లలేరు. ఈ కండీషన్లపై అభ్యంతరం ఉన్నా జుడీషియల్ డిసిప్లిన్, ట్రయల్ కోర్టు తీర్పును గౌరవిస్తూ వాటిపై వ్యతిరేక ఆదేశాలు ఇవ్వడం లేదని జస్టిస్ భూయాన్ అన్నారు.

News September 13, 2024

ఎర్రదళాన్ని నడిపించే కొత్త సారథి ఎవరో?

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో పార్టీ నూతన సారథిపై చర్చ నడుస్తోంది. 1964లో పార్టీ ఏర్పాటైన తర్వాత పదవిలో ఉండగా ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే తొలిసారి. కాగా త్వరలోనే పార్టీ అగ్రనేతలు సమావేశమై తదుపరి కార్యదర్శి ఎంపికపై చర్చిస్తారని తెలుస్తోంది. బెంగాల్ CPM కార్యదర్శి మహమ్మద్ సలీం, కేరళ CPM కార్యదర్శి ఎంవీ గోవింద్, త్రిపుర మాజీ CM మాణిక్ సర్కార్ పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం.