News November 24, 2024
రాజ్ థాక్రేకు భంగపాటు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.
Similar News
News November 24, 2024
ఈ నెల 27న వారి ఖాతాల్లో డబ్బులు జమ
TG: 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య రిటైర్డ్ అయిన కార్మికులకు దీపావళి బోనస్ రిలీజ్ చేస్తున్నట్లు సింగరేణి ఎండీ బలరామ్ తెలిపారు. ఈ నెల 27న వారి ఖాతాల్లోకి రూ.18.27కోట్లు జమ చేస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,570 చొప్పున 2,754 మంది కార్మికులకు బోనస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 24, 2024
‘నోటా’కు నో!
ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’కు ఓటేయొచ్చు. 2013లో ఈసీ ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది. మొదట్లో చాలామంది నోటాకే ఓటేయగా రానురాను ఆదరణ తగ్గిపోతోంది. నిన్న వెలువడిన మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే తేలింది. MHలో నోటాకు 0.75%, ఝార్ఖండ్లో 1.32% ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటాకు వేయడం వల్ల ఓటు వృథా అవుతోందని చాలామంది భావిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
News November 24, 2024
వాయుగుండం.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.