News November 24, 2024

రాజ్ థాక్రేకు భంగపాటు

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.

Similar News

News February 10, 2026

భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

image

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.

News February 9, 2026

చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్

image

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరో చారిత్రక అడుగుకు సిద్ధమైంది. చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చంద్రయాన్-4’ మిషన్‌కు కీలకమైన ల్యాండింగ్ సైట్‌ను ఖరారు చేసింది. ఈసారి కూడా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతానికే ఇస్రో ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్ కావడంతో ల్యాండింగ్‌, మట్టి సేకరణ, తిరిగి రావడం వంటి క్లిష్ట దశలు ఉన్నాయి. 2028 నాటికి ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు.

News February 9, 2026

వివాదాస్పద బుక్.. లీకేజీపై దర్యాప్తు

image

లోక్‌సభలో <<19052501>>ప్రకంపనలు<<>> రేపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఆత్మకథ పుస్తకం ఎలా లీకైందనేదానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. FIR నమోదు చేసి PDF కాపీ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి నిజాలు ఇందులో రాశారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ పబ్లిష్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నారు. కేంద్ర ఆమోదం లభించకపోవడంతో ఈ పుస్తకం పబ్లిషింగ్ నిలిచిపోయింది.