News September 15, 2024
ఏపీకి దివీస్ సంస్థ రూ.9.8 కోట్ల విరాళం
AP: వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. మంత్రి లోకేశ్‌ను కలిసిన దివీస్ సీఈవో కిరణ్ CMRFకు రూ.5 కోట్ల చెక్కును అందించారు. దీంతో పాటు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ.4.8 కోట్లను అందించారు. మొత్తంగా రూ.9.8 కోట్ల విరాళమిచ్చిన దివీస్ సంస్థను లోకేశ్ అభినందించారు.
Similar News
News October 4, 2024
మారుమూల ప్రాంతాలకూ పార్సిల్ డెలివరీ!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా అత్యంత మారుమూల ప్రాంతాలకూ పార్సిల్ డెలివరీ చేయనుంది. దేశంలో పెరుగుతున్న ఇ-కామర్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు రెండు సంస్థలూ తెలిపాయి. అమెజాన్, పోస్టల్ శాఖ 2013 నుంచి కలిసి పని చేస్తున్నాయి.
News October 4, 2024
మహిళలపై నేరాలు చూడలేక కళ్లు మూసుకున్న దుర్గామాత విగ్రహం వైరల్
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో దసరా ఉత్సవాల నిర్వాహకులు ఓ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ఆలోచింపజేస్తోంది. జీవచ్ఛవంలా పడి ఉన్న బాధితురాలిని చూడలేక దుర్గామాత కళ్లు మూసుకున్నట్టు, సింహం సిగ్గుతో తలదించుకున్నట్టు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలకు నిరసనగా ఏర్పాటు చేసిన ఈ మండపం ‘లజ్జా’ (అవమానం) ఇతివృత్తంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
News October 4, 2024
అందుకే పాక్ కంటే ఇంగ్లండ్ బెటర్: పాక్ క్రికెటర్
ఇంగ్లండ్ ప్రొఫెషనల్ క్రికెట్ అద్భుతంగా ఉంటుందని పాక్ క్రికెటర్ మొహమ్మద్ అబ్బాస్ తెలిపారు. జీతాలు, బట్టలు, ఆహారం అన్నీ పాకిస్థాన్ కంటే బెటర్‌గా అందిస్తుందని చెప్పారు. ‘క్వీన్ ఎలిజబెత్ చనిపోయినా ఇంగ్లండ్ క్రికెట్ షెడ్యూల్ మార్చలేదు. ఆటగాళ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కానీ పాక్‌లో ఇలాంటి పరిస్థితులు లేవు. పీసీబీ చెప్పినట్లే నడుచుకోవాలి. అందుకే కౌంటీల్లో ఆడేందుకే నా ప్రాధాన్యం’ అని ఆయన చెప్పుకొచ్చారు.