News February 8, 2025
సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య

సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్స్టా చాట్లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.
Similar News
News December 6, 2025
సల్కర్ పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేటలో 12.8 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 13.3, మిడ్జిల్ మండలం దోనూరు 13.4, రాజాపూర్ 13.6, జడ్చర్ల 14.1, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, పారుపల్లి 14.7, భూత్పూర్ 14.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది.
News December 6, 2025
‘కింగ్’ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తారా?

విశాఖ వేదికగా IND-SA మధ్య ఇవాళ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి. అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.
News December 6, 2025
ఇంటింటికీ ఫ్రీ వైఫై, టీవీ ఛానల్స్.. బాండ్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు సర్పంచ్ అభ్యర్థులు స్థాయికి మించిన హామీలు ఇస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలపై బాండ్లు రాసిచ్చేవారు అరుదు. ములుగు(D) ఏటూరునాగారంలో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి, ఆమె భర్త చక్రవర్తి ఇంటింటికీ వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ ఫ్రీగా అందిస్తామని బాండ్ రాసిచ్చారు. కోతుల బెడద, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.


