News May 25, 2024
జెనీవా ఓపెన్‌లో జకోవిచ్ ఓటమి

టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జెనీవా ఓపెన్ టోర్నీ సెమీ ఫైనల్‌లో 45వ ర్యాంకు ఆటగాడు టొమాస్ మచాక్ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. కేవలం 3 సెట్లలోనే జకో పోరాటం ముగియడం గమనార్హం. ఆట సాగినంత సేపూ ఆయన అసౌకర్యంగానే కనిపించారు. ఈ నెల 26 నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగే జకోవిచ్, అక్కడ ఎలా ఆడతారోనన్న ఆందోళన ఆయన అభిమానుల్లో నెలకొంది.
Similar News
News April 17, 2026
ఈనెల 21న అమలాపురంలో జాబ్ మేళా

ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలకు 8978905032ను సంప్రదించాలన్నారు.
News April 17, 2026
జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారు: మిథున్ రెడ్డి

లోక్‌సభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా YCP MP మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. నలుగురు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.


