News March 20, 2024
అభ్యర్థుల్ని ప్రకటించిన డీఎంకే
తమిళనాట 39 లోక్‌సభ సీట్లకు గాను అధికార డీఎంకే పార్టీ 21 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. కీలక అభ్యర్థుల్లో.. కనిమొళి తూత్తుకుడి నుంచి, దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి బరిలో ఉన్నారు. మిగిలిన సీట్లను ఇండియా కూటమికి కేటాయించనుంది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అటు అన్నాడీఎంకే కూడా 16మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.
Similar News
News September 15, 2024
నేటి ముఖ్యాంశాలు
* సీతారాం ఏచూరి పార్థివదేహం ఎయిమ్స్‌కు అప్పగింత
* TG: ముడి పామాయిల్ దిగుమతులపై పన్ను పెంపు: మంత్రి తుమ్మల
* త్వరలో హైడ్రాకు మరిన్ని అధికారాలు: రంగనాథ్
* కౌశిక్ ఇంటిపై దాడి రేవంత్ పనే: KTR
* ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్సే: మంత్రి పొన్నం
* AP: స్టీల్‌ప్లాంట్‌ను రక్షించలేకపోతే రాజీనామా చేస్తాం: పల్లా
* వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల
News September 15, 2024
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య: మాజీ మంత్రి
AP: మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే తగ్గించేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల భర్తీకి NMC ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. కాలేజీల్లో మౌలిక సదుపాయాలకు NMC నిధులిస్తే వద్దన్న ఘనత చంద్రబాబుదే. మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య. విద్యార్థులకి ద్రోహం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
News September 15, 2024
చివరి సినిమాకు రూ.275 కోట్ల రెమ్యునరేషన్?
తమిళ హీరో విజయ్ తన చివరి సినిమా ‘దళపతి69’కి భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీ కోసం ఏకంగా రూ.275 కోట్లు తీసుకుంటారని సమాచారం. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో ఓ మూవీకి అత్యధిక మొత్తం తీసుకోనున్న నటుడిగా నిలవనున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది. కాగా రెమ్యూనరేషన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.