News October 7, 2024

DMK vs పవన్ కళ్యాణ్

image

డీఎంకే, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్ వేయడంపై డీఎంకే ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు పవన్‌పై అడ్వకేటుతో ఫిర్యాదు చేయించడం, ప్రకాశ్ రాజ్‌‌తో ట్వీట్లు పెట్టించడం DMK పనేనని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News December 11, 2025

భారత్‌కి సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నా: మస్క్

image

స్టార్‌లింక్ ద్వారా భారత్‌కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నానని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్‌తో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశమైన తరువాత మస్క్ ఈ విధంగా స్పందించారు. భారత్‌లో చివరి మైలు కనెక్టివిటీని శాటిలైట్‌ ద్వారా విస్తరించే దిశగా చర్చలు జరిగాయని సింధియా ‘X’లో పోస్ట్ చేశారు. డిజిటల్‌ భారత్ లక్ష్యాలకు శాటిలైట్‌ టెక్నాలజీ కీలకమని అన్నారు.

News December 11, 2025

రోజ్మేరీ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

image

రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్​ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి

News December 11, 2025

550 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కపుర్తాలాలోని <>రైల్<<>> కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PWD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://rcf.indianrailways.gov.in