News June 13, 2024
అలా చేసి ఇంగ్లండ్‌ను ఇంటికి పంపండి: టిమ్ పైన్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టిమ్ పైన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్‌ను బయటకు పంపించేందుకు స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫలితాలను తప్పకుండా తారుమారు చేయాలంటూ సూచించారు. తాను జోక్ చేయట్లేదని సీరియస్‌గానే ఈ కామెంట్స్ చేస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. తాను చెప్పినట్లు చేస్తే టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించి టైటిల్ గెలవడం ఆసీస్‌కు సులభమవుతుందని పైన్ చెప్పుకొచ్చారు.
Similar News
News September 9, 2024
సలార్-2లో మోహన్ లాల్?
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్‌బస్టర్ అవడంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం మోహన్ లాల్‌ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి నటిస్తున్న విషయం తెలిసిందే.
News September 9, 2024
MPలో స్పోర్ట్స్ క్యాలెండర్‌లోకి ‘పిట్టు’
కనుమరుగైపోతున్న ‘పిట్టు’ గేమ్‌ను మధ్యప్రదేశ్ విద్యాశాఖ స్పోర్ట్స్ క్యాలెండర్‌లో చేర్చింది. శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆట ఆడేవారని, ఇది దేశంలోనే అతి పురాతన ఆటల్లో ఒకటిగా పేర్కొంది. దీంతో ఇక నుంచి అక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దీన్ని పల్లి, లగోరీ అని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇంతకీ మీ ఏరియాలో దీన్ని ఏమంటారు?
News September 9, 2024
స్వయం సహాయక మహిళలకు ఏటా 2 చీరలు: సీఎం రేవంత్
TG: IITHకు వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలోనే భవనం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. IITH ఏర్పాటు చేయాలని కోరగానే రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మంజూరు చేశారని తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కరణల కోసం దీనిని ప్రారంభించినట్లు చెప్పారు. మరోవైపు 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఏటా 2 చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.