News August 19, 2024
పరుగు ఆపిన వెంటనే ఇలా చేయొద్దు
చాలామంది జాగింగ్ లేదా రన్నింగ్ పూర్తి కాగానే వెంటనే కూలబడుతుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ‘పరిగెత్తిన తర్వాత శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి టైమ్ పడుతుంది. కాసేపు నెమ్మదిగా నడవడమో లేక నిల్చుని ఉండటమో చేయాలి. వెంటనే కూర్చుంటే కాళ్లలోకి రక్తం ఎక్కువ చేరి నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కోసారి మూర్ఛ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది’ అని వారు హెచ్చరిస్తున్నారు.
Similar News
News September 19, 2024
టీటీడీ లడ్డూ రిపోర్టుపై YCP శ్రేణులు ఫైర్
AP: తిరుపతి లడ్డూ తయారీలో ఎద్దు కొవ్వు, చేప నూనె వాడారంటూ టీడీపీ శ్రేణులు పోస్ట్ చేస్తున్న <<14141948>>ల్యాబ్ రిపోర్టు<<>>పై వైసీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. నెయ్యి శాంపిల్ తీసుకున్నది జులై 17వ తేదీ అని, రిపోర్టు వచ్చింది జులై 24వ తేదీ అని దీని ప్రకారం లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ ఎవరి హయాంలో జరిగిందో చెప్పాలని సీఎం చంద్రబాబు, టీడీపీ శ్రేణులను ప్రశ్నిస్తున్నాయి.
News September 19, 2024
అక్టోబర్ 22న ప్రభాస్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ రీ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దశరథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు నిర్మించారు. 2011లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
News September 19, 2024
కంగనపై దానం వ్యాఖ్యలు సరికాదు: KTR
TG: బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దిగజారి మాట్లాడటం సరికాదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆమెను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. గతంలో సోనియా గురించి అసోం సీఎం అభ్యంతరకరంగా మాట్లాడితే కేసీఆర్ ఖండించారని కేటీఆర్ గుర్తు చేశారు. మహిళల పట్ల అగౌరవ వ్యాఖ్యలను పార్టీలు సమర్థించకూడదన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని ఆయన కోరారు.