News February 16, 2025

నిద్రలేవగానే ఇలా చేయండి

image

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.

Similar News

News April 17, 2026

LRS దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి: మంత్రి

image

AP: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు దాఖలైన LRS దరఖాస్తులలో అర్హమైన వాటిని వెంటనే ఆమోదించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్‌పై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి సురేశ్‌, ఇతర అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వాటిని క్లియర్ చేయాలని సూచించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన దరఖాస్తు గడువు ఈనెల 23తో ముగియనుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News April 17, 2026

ఆగిన బంగారం ఇంపోర్ట్స్.. పెరగనున్న ధరలు?

image

కేంద్ర ప్రభుత్వం (DGFT) నుంచి అనుమతులు రాకపోవడంతో భారత బ్యాంకులకు బంగారం, వెండి దిగుమతులు నిలిచిపోయాయని రాయిటర్స్ పేర్కొంది. దీంతో టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఆర్డర్లు ఆగిపోయాయి. ఏటా ఏప్రిల్‌ ఆరంభంలోనే ఇచ్చే అనుమతి ఆలస్యం కావడంతో విదేశీ ఆర్డర్లకు బ్రేక్ పడింది. దీనివల్ల దేశీయంగా సరఫరా తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

News April 17, 2026

బుమ్రా స్పీడ్ పెంచాలి.. ఇర్ఫాన్ సూచనలు

image

IPL: MI స్టార్ బౌలర్ బుమ్రా ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ పలు సూచనలు చేశారు. బుమ్రా బౌలింగ్ వేగం తగ్గిందని, దాంతో పాటు స్లో బాల్స్ ఎక్కువగా వేస్తున్నారన్నారు. అలా కాకుండా వేగంగా బౌలింగ్ చేస్తూ అప్పుడప్పుడు స్లో బాల్స్ వేస్తే వికెట్లు వచ్చే ఛాన్సుందన్నారు. బుమ్రాకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదని, చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.