News November 13, 2024
గుండె ఆరోగ్యం పెరగాలంటే ఇలా చేయండి!

శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని శారీరక వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల గుండె వ్యాధులకు కారణమయ్యే కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. జాగింగ్/ రన్నింగ్ చేస్తే హృదయనాళ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సైక్లింగ్ వల్ల కీళ్లకు మేలు జరుగుతుంది. యోగాతో ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల హృదయనాళ వ్యవస్థ & కండరాల ఆరోగ్యం పెరుగుతుంది. SHARE IT
Similar News
News March 13, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 13, 2026
శుభ సమయం (13-3-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ దశమి తె.5.51 వరకు
➤ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.06 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.11-8.32, మ.1.18-సా.4.04, సా.5.04-సా.6.03
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.33-ఉ.9.12, మ.12.30-మ.1.18
➤ వర్జ్యం: ఉ.9.22-ఉ.11.07
➤ అమృత ఘడియలు: రా.7.51-రా.9.36
News March 13, 2026
పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్‌తో మోదీ చర్చలు

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్‌తో చర్చించినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల ధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరుల భద్రత, అడ్డంకులు లేని ఇంధన సరఫరా తమకు అత్యంత ప్రాధాన్యత అంశాలని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతికి కట్టుబడి ఉంటుందని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పెజెష్కియాన్‌ను కోరారు.


