News June 6, 2024

మీరు సెక్యులర్ అనే నమ్ముతున్నా: ప్రకాశ్ రాజ్

image

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ అభినందనలు తెలిపారు. ‘మీతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఎన్డీఏలో ఉన్నా మోదీలా కాకుండా సెక్యులర్ నాయకులగానే ఉంటారని నమ్ముతున్నా. జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలి. అలాగే దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

Similar News

News December 9, 2024

లోన్ తిప్పలు: ₹39 వేల కోడి మాంసం ఆరగించిన బ్యాంకు మేనేజర్

image

లోన్ అప్రూవ్ చేయడానికి ఓ క‌స్ట‌మ‌ర్ నుంచి ₹39 వేల కోడి మాంసం ఆర‌గించాడో బ్యాంకు మేనేజ‌ర్‌. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని మ‌స్తూరీకి చెందిన రూప్‌చంద్ పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్త‌రించేందుకు ₹12 ల‌క్ష‌ల రుణం కోసం SBI మేనేజ‌ర్‌ను క‌లిశారు. ఆయన 10% క‌మీష‌న్ తీసుకున్నారు. అలాగే ప్ర‌తి శనివారం చికెన్ పంపాల్సిందిగా ఆదేశించారు. ₹39K కోడి మాంసం ఆర‌గించినా లోన్ మంజూరు చేయకపోవడంపై బాధితుడు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.

News December 9, 2024

‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్

image

INDIA కూట‌మి సార‌థ్య బాధ్య‌తలు మ‌మ‌తా బెన‌ర్జీకి ఇవ్వాల‌న్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల తర్వాత మిత్ర‌ప‌క్షాల భేటీనే జ‌ర‌గ‌లేద‌ని, అలాంట‌ప్పుడు నాయ‌క‌త్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌శ్నించారు. స‌మావేశం నిర్వహించినప్పుడు మ‌మ‌త సార‌థ్య బాధ్య‌త‌లు కోర‌వ‌చ్చని, అప్పుడే ఈ విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు.

News December 9, 2024

నాగబాబుకు మంత్రి పదవి

image

AP: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.