News September 12, 2024
ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తావా?: గాంధీ

TG: తనను బతకడానికి వచ్చావా అన్న BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘నేను 3 సార్లు MLAగా గెలిచా. నన్ను <<14083308>>బతకడానికి <<>>వచ్చావా? అని ఎలా అంటావు? నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చావు? బతకడానికి కాదా? 29 రాష్ట్రాల ప్రజలు ఉంటున్న ఈ ప్రాంతంలో జనం మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తావా?’ అని గాంధీ ప్రశ్నించారు. అరెస్టైన ఆయన్ను గచ్చిబౌలి PSకు పోలీసులు తరలించారు.
Similar News
News August 30, 2025
కాళేశ్వరం నివేదికపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

కాళేశ్వరం నివేదికపై మాజీమంత్రి హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ‘వాస్తవాలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేం ప్రజలకు నిజాలను వివరిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి ఎందుకు భయం? నిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే’ అని పేర్కొన్నారు.
News August 30, 2025
చెంపదెబ్బ వీడియో.. శ్రీశాంత్ భార్య ఫైర్

IPL-2008లో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన <<17553113>>వీడియోను<<>> మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఇన్‌స్టా వేదికగా ఫైరయ్యారు. ‘లలిత్, మైకేల్ క్లార్క్ ఇలా చేయడం అమానుషం. చౌకబారు ప్రచారాలకు ఎప్పుడో జరిగిన విషయాన్ని లేవనెత్తడమేంటి? అసలు నిజాన్ని బయటపెట్టాలి. ఈ వీడియోతో ఆటగాళ్లు, కుటుంబాన్ని బాధపెట్టిన క్లార్క్, లలిత్‌పై కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.
News August 30, 2025
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

TG: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు సభ మొదలవనుంది. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు అనుమతించనుంది. అయితే దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.