News September 12, 2024

ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తావా?: గాంధీ

image

TG: తనను బతకడానికి వచ్చావా అన్న BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘నేను 3 సార్లు MLAగా గెలిచా. నన్ను <<14083308>>బతకడానికి <<>>వచ్చావా? అని ఎలా అంటావు? నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చావు? బతకడానికి కాదా? 29 రాష్ట్రాల ప్రజలు ఉంటున్న ఈ ప్రాంతంలో జనం మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తావా?’ అని గాంధీ ప్రశ్నించారు. అరెస్టైన ఆయన్ను గచ్చిబౌలి PSకు పోలీసులు తరలించారు.

Similar News

News October 14, 2024

ఓలాపై సెటైరికల్ ట్వీట్.. మామూలుగా లేదుగా!

image

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయ్, సర్వీస్ బాగుండట్లేదంటూ ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ దసరాకు దేశవ్యాప్తంగా సంతోషాలు పంచుతామంటూ డెలివరీకి సిద్ధంగా ఉన్న స్కూటర్ల ఫొటోలను ఓలా ట్వీట్ చేసింది. ‘దయచేసి ఢిల్లీ NCRకు డెలివరీ చేయకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణసంచాను బ్యాన్ చేసింది’ అని రిప్లై ఇచ్చాడు.

News October 14, 2024

BREAKING: భారత్ ఓటమి.. WC నుంచి ఔట్?

image

T20 WC: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (54*) చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. లాస్ట్ ఓవర్లో టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. రేపు PAKపై జరిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఇంటికి వెళ్లినట్లే.

News October 14, 2024

భూకేటాయింపులపై ఖర్గే కీలక నిర్ణయం!

image

ముడా స్కాంలో కర్ణాటక CM సిద్ధ రామయ్యపై ED కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు KT ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను తిరిగివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.