News November 29, 2024
ఇలాంటి జాబ్ మీరూ చేస్తారా?
ఉద్యోగాలంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఒకరి కింద తక్కువ జీతానికి పనిచేయాలి కాబట్టి. కానీ, ఏడాదికి రెండు సార్లు మాత్రమే పనిచేస్తూ రూ.లక్షల్లో జీతం పొందే ఉద్యోగం గురించి మీకు తెలుసా? సియోక్స్ ఫాల్స్ టవర్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బల్బును ఒక్కసారి మార్చినందుకు ఆ ఉద్యోగికి 20,000 డాలర్లు (రూ.16.5 లక్షలు) చెల్లిస్తారు. 1500 ఫీట్ల ఎత్తులో ఉన్న టవర్‌పైకి ఎక్కి దానిపైన ఉన్న బల్బును మార్చితే చాలు.
Similar News
News November 29, 2024
ఆ ప్రచారంలో అల్లు అర్జున్ పాలుపంచుకోవడం సంతోషం: సీఎం రేవంత్
డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించే ప్రకటనలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘మన పిల్లల్ని, రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి రక్షించుకునేందుకు ప్రజల్లో అవగాహనకోసం చేపట్టిన ప్రచారంలో అల్లు అర్జున్‌ని చూడటం సంతోషంగా ఉంది. ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’ అని ట్విటర్లో పిలుపునిచ్చారు.
News November 29, 2024
క్రికెటేతర అథ్లెట్లకేదీ గౌరవం.?
ఫొటోలోని వ్యక్తి పేరు సర్వాన్ సింగ్. 1954 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చారు. అయినా గుర్తింపు, ఉద్యోగం రాలేదు. బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్ రెజిమెంట్‌లో చేరి 1970లో రిటైర్ అయ్యారు. బతుకుతెరువు కోసం గోల్డ్ మెడల్ అమ్మేసి ట్యాక్సీ కొనుక్కున్నారు. పేదరికంలోనే కన్నుమూశారు. నేటికీ క్రికెటేతర అథ్లెట్లలో చాలామందిది ఇలాంటి కథే. ఇతర క్రీడలకూ దేశంలో ప్రాధాన్యం దక్కాలన్నదానిపై మీ అభిప్రాయం?
News November 29, 2024
అందరి సపోర్ట్ భారత్‌కే.. ఒంటరైన పాక్!
ICC ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు భారత్‌కే సపోర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహణకు ఒప్పుకోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒంటరైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో భద్రత దృష్ట్యా అక్కడికి వెళ్లేది లేదని భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టోర్నీ పాకిస్థాన్ నుంచి తరలించి వేరే దేశాల్లో నిర్వహించేందుకు ICC కసరత్తు చేస్తోంది.