News November 29, 2024
ఇలాంటి జాబ్ మీరూ చేస్తారా?
ఉద్యోగాలంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఒకరి కింద తక్కువ జీతానికి పనిచేయాలి కాబట్టి. కానీ, ఏడాదికి రెండు సార్లు మాత్రమే పనిచేస్తూ రూ.లక్షల్లో జీతం పొందే ఉద్యోగం గురించి మీకు తెలుసా? సియోక్స్ ఫాల్స్ టవర్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బల్బును ఒక్కసారి మార్చినందుకు ఆ ఉద్యోగికి 20,000 డాలర్లు (రూ.16.5 లక్షలు) చెల్లిస్తారు. 1500 ఫీట్ల ఎత్తులో ఉన్న టవర్‌పైకి ఎక్కి దానిపైన ఉన్న బల్బును మార్చితే చాలు.
Similar News
News December 5, 2024
దేవేంద్రుడి పట్టాభిషేకం నేడే
మహారాష్ట్ర CMగా దేవేంద్ర ఫడణవీస్ ఇవాళ సా.5.30 గం.కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన CMగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఫడణవీస్‌తో పాటు Dy.CMగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. అయితే డిప్యూటీ పోస్ట్ తీసుకోవడానికి ఏక్‌నాథ్ శిండే వెనుకాడుతున్నారు. ఆయన ప్రమాణం చేస్తారా? లేదా? అనేది సాయంత్రం తేలనుంది.
News December 5, 2024
రైల్వే ప్రయాణికులకు తీపి వార్త
ఇకపై ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LHB కోచ్‌లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో వంద మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, లక్ష మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. వీటిల్లో ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది.
News December 5, 2024
ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్
AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.