News January 24, 2025
పదే పదే వేడి చేసిన టీ తాగుతున్నారా?

చాలా మంది తమ రోజును టీతో ప్రారంభిస్తారు. కానీ పదే పదే వేడి చేసిన టీ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ టీలో రుచి మారి పోషకాలు తగ్గిపోతాయి. చాలాసేపు ఉడికించిన టీ తాగడం వల్ల కడుపు నొప్పి, పొత్తి కడుపువాపు రావచ్చు. చర్మంపై మొటిమలు కూడా ఏర్పడతాయి. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. డీహైడ్రేషన్ ఏర్పడి శరీర ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. టీ కాచిన 15 నిమిషాల్లోగా తాగడం ఉత్తమం.
Similar News
News February 19, 2025
జాక్‌పాట్ కొట్టిన రేఖా గుప్తా

ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) MLA రేఖా గుప్తాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ముఖ్యమంత్రి పదవి వరించడం విశేషం. రేఖ అనూహ్యంగా సీఎం అభ్యర్థి రేసులోకి వచ్చారు. పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ వంటి హేమాహేమీలను కాదని హైకమాండ్ ఆమె వైపే మొగ్గు చూపింది. అలాగే దేశంలోని NDA పాలిత రాష్ట్రాల్లో ఈమె ఒక్కరే మహిళా సీఎం కావడం విశేషం.
News February 19, 2025
నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

TG: నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. దాదాపు 120 ఎకరాల్లో మంటలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. నాగార్జునపేట తండా, జమ్మనకోట తండా, మూలతండా వరకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రధాన డ్యామ్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
News February 19, 2025
సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్

AP: ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్‌పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.