News March 10, 2025
మాంసాహారం తింటున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త!

పెరుగుతో గుడ్డు, మాంసాహారం కలిపి తినడం మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమేనంటున్నారు పోషకాహార నిపుణులు. మాంసాహారం, పాల పదార్థాలను వెనువెంటనే తినకూడదని, తింటే జీర్ణ, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక నాన్ వెజ్ తిన్న తర్వాత టీ తాగితే గుండెల్లో మంట రావొచ్చంటున్నారు. అలాగే మటన్ తర్వాత తేనె తీసుకుంటే ఒంట్లో ఉష్ణం పెరిగిపోతుందని, అది కూడా నివారించాలని సూచిస్తున్నారు.
Similar News
News March 23, 2025
27న పోలవరానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
News March 23, 2025
కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.
News March 23, 2025
ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ

AP: చంద్రబాబు 40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని YCP విమర్శించింది. ఎన్నికల్లో కపట హామీలు ఇచ్చి గెలిచాక వాటి ఊసే ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. వాలంటీర్లు, ఏపీ అప్పు, సూపర్ 6, భృతి, ఉచిత బస్సు, పోలవరం విషయంలో మోసం చేశారని ఆరోపించింది. ఇప్పటికే మండలిలో ప్రభుత్వాన్ని YCP ప్రశ్నిస్తోందని, శాసనసభలోనూ ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత నిలదీస్తారని CBN భయపడుతున్నారని పేర్కొంది.