News January 14, 2025
నిద్రలో కింద పడిపోతున్నట్లు అనిపిస్తోందా?
చాలామంది నిద్రలోకి జారుకోగానే కిందపడిపోతున్నామనే ఫీలింగ్ వచ్చి జెర్క్ ఇస్తారు. దీన్నే హిప్నిక్ జెర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. నిద్రపోతుండగా శరీర కండరాల్లో కదలికల వల్లే ఈ ఆకస్మిక కుదుపులు సంభవించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, ఆందోళన, అలసట కూడా కారణాలేనట. అయితే నిద్ర డిస్టర్బ్ కావడం, తరచూ దీనికి గురైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Similar News
News January 15, 2025
లోకేశ్ గిఫ్ట్.. రిప్లై ఇచ్చిన బ్రాహ్మణి
AP: సంక్రాంతి వేళ మంత్రి లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతమని, వారికి అండగా నిలుద్దామని ట్వీట్ చేశారు. దీనికి బ్రాహ్మణి రిప్లై ఇస్తూ.. ‘లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతిచోటా చేనేతను ప్రమోట్ చేస్తారు. చేనేతలపై అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు’ అని పేర్కొన్నారు.
News January 15, 2025
యుద్ధ నౌకలను ప్రారంభించనున్న PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రెండు యుద్ధ నౌకలు INS సూరత్, నీలగిరి, ఒక జలాంతర్గామి వాఘ్‌షీర్‌ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో యుద్ధనౌకలను, జలాంతర్గామిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన మహాయుతి కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
News January 15, 2025
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పార్టీ అధిష్ఠానంతో క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులనూ ఆయన కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం సింగపూర్‌కు వెళ్లనున్న ఆయన ఈనెల 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటిస్తారు.