News January 14, 2025

నిద్రలో కింద పడిపోతున్నట్లు అనిపిస్తోందా?

image

చాలామంది నిద్రలోకి జారుకోగానే కిందపడిపోతున్నామనే ఫీలింగ్ వచ్చి జెర్క్ ఇస్తారు. దీన్నే హిప్నిక్ జెర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. నిద్రపోతుండగా శరీర కండరాల్లో కదలికల వల్లే ఈ ఆకస్మిక కుదుపులు సంభవించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, ఆందోళన, అలసట కూడా కారణాలేనట. అయితే నిద్ర డిస్టర్బ్ కావడం, తరచూ దీనికి గురైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Similar News

News February 18, 2025

ప్రతీకారం తీర్చుకుంటా: షేక్‌హసీనా

image

ఆవామీలీగ్ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ఆపార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తానని అందరికీ న్యాయం చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనలో ఎంతోమంది కళాకారులు, పోలీసులు, కార్యకర్తలు హత్యకు గురైనా యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.

News February 18, 2025

తునిలో BNS సెక్షన్ 163(2) అమలు

image

AP: తుని మున్సిపాలిటీ <<15498069>>పరిధిలో <<>>BNS సెక్షన్ 163(2) అమలు చేస్తూ కాకినాడ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సభలు, సమావేశాలు, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం అమలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కర్రలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని తిరగడంపై నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. తదుపరి ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు ప్రతిరోజూ ఉ.6 నుంచి సా.6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

News February 18, 2025

పోర్న్‌హబ్‌లో Maths పాఠాలు.. పిల్లలే టార్గెట్?

image

పోర్న్ వెబ్‌సైట్లలో మాథ్స్ సహా ఇతర సబ్జెక్టుల పాఠాలపై ఇటీవల వార్తలు వచ్చాయి. పోర్న్ చూసేవాళ్లను మార్చడం కాకుండా పిల్లలు, యూత్‌ను దాని వైపు ఆకర్షించడమే దీని ఉద్దేశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట FB, INSTA తర్వాత ONLY FANS అంటూ క్రియేటర్లు పంథా మార్చేస్తారని, చివరికి పోర్న్ వెబ్‌సైట్లకు తీసుకెళ్లి ‘<<15498869>>డోపమైన్ ఫీడ్‌బ్యాక్ లూప్<<>>’ సిస్టమ్‌తో తమకు కావాల్సిన రీతిలో వాడుకుంటారని వార్నింగ్ ఇస్తున్నారు.

error: Content is protected !!