News August 27, 2024

జ్వరమొచ్చిందా?

image

AP, TGలో <<13948570>>డెంగ్యూ<<>> విజృంభిస్తోంది. ప్రతి 200 మందిలో 13 మందికి పాజిటివ్‌ వస్తోంది. దీంతో జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంగ్యూ పరీక్షలు చేయించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే 4-5 రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందంటున్నారు. డెంగ్యూకు కారణమైన టైగర్ దోమ నీటిలో పెరిగి, ఎక్కువగా పగటిపూట కుడుతుంది. చిన్నారులు వీటి బారినపడే అవకాశం ఎక్కువ కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి.

Similar News

News December 16, 2025

CLAT-2026 ఫలితాలు విడుదల

image

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. <>https://result1.consortiumofnlus.ac.in/<<>>లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. కాగా డిసెంబర్ 7న జరిగిన పరీక్షకు దాదాపు 92వేల మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలలో UG, PG ప్రోగ్రాముల్లో సీట్లు కేటాయిస్తారు.

News December 16, 2025

కోడి గీతలతో YCP కోటి సంతకాల డ్రామా: సత్యకుమార్

image

AP: మెడికల్ కాలేజీల విషయంలో ప్రజా మద్దతు లేక YCP చీఫ్ జగన్ కోడి గీతలతో కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 10 వైద్య కళాశాలలను PPP విధానంలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జగన్ దాన్ని ప్రైవేటీకరణగా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం, కోర్టులు PPPని సమర్థించాయని, దీనిపై ఆయన కోర్టుకెళ్తేనే మేలని చెప్పారు.

News December 16, 2025

రూ.1,000 కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారుగా.. న్యాయమూర్తి ఆశ్చర్యం

image

TG: ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించట్లేదంటూ TGSPDCL గీతం యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ వర్సిటీ హైకోర్టుకు వెళ్లింది. 2008 నుంచి రూ.118 కోట్ల బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సామాన్యులు రూ.1,000 కట్టకపోతే అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారని, గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ SE హాజరుకావాలని ఆదేశించారు.