News September 12, 2024

ఈ 11 అలవాట్లు మీకు ఉన్నాయా?

image

కొన్ని అలవాట్ల వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేమి, అల్పాహారం తినకపోవడం, సరిపడా నీరు తాగకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలు, చీకటి గదిలో ఉండటం, అతిగా తినడం, నిరంతరం హెడ్ ఫోన్స్ వాడటం, ప్రతిదీ గూగుల్ చేయడం, మొబైల్ ఎక్కువగా చూడటం వంటి అలవాట్ల వల్ల బ్రెయిన్‌కు నష్టం కలుగుతుంది. వీటన్నింటిని తగ్గించుకుంటేనే మెదడు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Similar News

News October 5, 2024

ఆరోజున ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ వెల్లువ?

image

ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు అప్‌డేట్స్ వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. రాజాసాబ్ నుంచి టీజర్, హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్, కల్కి-2 నుంచి అప్‌డేట్, సందీప్ వంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు డార్లింగ్, ఈశ్వర్ మూవీస్ రీ-రిలీజ్ ఉండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్నారు రెబల్ ఫ్యాన్స్‌.

News October 5, 2024

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

image

TG: మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 5, 2024

జెర్రి పడిందన్నది అవాస్తవం.. నమ్మొద్దు: TTD

image

తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.