News January 17, 2025
ఐశ్వర్యా రాజేశ్ తండ్రి, మేనత్తల గురించి తెలుసా?

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘భాగ్యం’ క్యారెక్టర్లో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ నటనపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. అయితే, ఆమె తండ్రితో పాటు మేనత్త కూడా ఇండస్ట్రీ వారే అని చాలా మందికి తెలియదు. జంధ్యాల తెరకెక్కించిన ‘నెలవంక’తో పాటు పలు చిత్రాల్లో నటించిన రాజేశ్ కూతురే ఈ ఐశ్వర్య. అంతేకాదు ఆమె తెలుగులో పాపులర్ నటి శ్రీలక్ష్మికి మేనకోడలు. ఐశ్వర్య నటన ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 29, 2025
శ్రీ సత్యసాయి: ఎన్నికలు ఏకగ్రీవం

శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా శాఖా ఎన్నికలు కలెక్టరేట్లో ఆదివారం జరిగినట్లు ఎన్నికల అధికారి దివాకర్ రావు వెల్లడించారు. హిందూపురం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయ డీటీ గిరిధర్ అసోసియేట్ అధ్యక్షుడిగా, పుట్టపర్తి డీటీ కళ్యాణ చక్రవర్తి కార్యదర్శిగా, సోమందేపల్లి డీటీ శ్రీకాంత్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 29, 2025
‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్ప్రైజ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆదివారం ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కానీ విడుదల కాలేదు.
News December 29, 2025
చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.


