News January 17, 2025

ఐశ్వర్యా రాజేశ్ తండ్రి, మేనత్తల గురించి తెలుసా?

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘భాగ్యం’ క్యారెక్టర్‌లో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ నటనపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. అయితే, ఆమె తండ్రితో పాటు మేనత్త కూడా ఇండస్ట్రీ వారే అని చాలా మందికి తెలియదు. జంధ్యాల తెరకెక్కించిన ‘నెలవంక’తో పాటు పలు చిత్రాల్లో నటించిన రాజేశ్ కూతురే ఈ ఐశ్వర్య. అంతేకాదు ఆమె తెలుగులో పాపులర్ నటి శ్రీలక్ష్మికి మేనకోడలు. ఐశ్వర్య నటన ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 19, 2025

ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

image

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News February 19, 2025

బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: యోగి

image

UP ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ కొట్టిపారేశారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫైరయ్యారు. కాగా జనవరి 12, 13 తేదీల్లో మహాకుంభమేళా నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరావని NGTకి నివేదిక ఇచ్చింది.

News February 19, 2025

‘ఐదుగురు స్పిన్నర్లెందుకు?’.. రోహిత్ స్ట్రాంగ్ రిప్లై

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ జవాబిచ్చారు. ‘మీకు ఐదుగురు స్పిన్నర్లు కనిపిస్తున్నారు. కానీ నాకు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు కనిపిస్తున్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వల్ల బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది’ అని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ తమకెంతో ముఖ్యమని తెలిపారు.

error: Content is protected !!