News January 15, 2025

కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?

image

AP: సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమలోని జగ్గన్నతోటలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కనుమ రోజు ప్రభలను ఊరు దాటిస్తే మంచిదని స్థానికుల విశ్వాసం. కొన్ని వందల ఏళ్ల క్రితం జగ్గన్నతోటలోనే ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ప్రతి కనుమ రోజున వీటిని ఒకే చోట చేర్చుతారు. ఈ ప్రభలను తీసుకొచ్చే క్రమంలో యువకులు పొలాలు, వాగులు దాటుతూ ముందుకు సాగుతారు.

Similar News

News February 19, 2025

APPLY.. రూ.55,000 జీతంతో ఉద్యోగాలు

image

ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మార్చి 1 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. బీఈ/బీటెక్ చేసిన వారిని అర్హులుగా పేర్కొంది. రిజర్వేషన్‌ను బట్టి వయో సడలింపు ఉంది. శాలరీ గరిష్ఠంగా రూ.55,000 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.ntpc.co.in.

News February 19, 2025

‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు అయ్యాయి. మస్క్‌కు చెందిన AI సంస్థ XAI గ్రోక్-3 సేవల్ని అందుబాటులోకి తెచ్చి ధరల్ని పెంచింది. యూజర్లు ఈ AI మోడల్ ఫీచర్స్ వాడాలంటే ‘X’లో ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ ధర నెలకు రూ.1750 ఉండగా.. రూ.3,470కి పెంచింది. ఏడాది ప్లాన్ రూ.18,300 నుంచి రూ.34,340కి చేరింది. 2023లో ‘X’ ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.1300 ఉండేది.

News February 19, 2025

CMRF చెక్కుల పంపిణీకి ఈసీ బ్రేక్

image

TG: రాష్ట్రంలో CMRF నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మార్చి 4 వరకు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. కాగా తెలంగాణలోని 33 జిల్లాలకు 24 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో చెక్కుల పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.

error: Content is protected !!