News August 23, 2024
MF ఇన్వెస్టర్లూ మీకీ సంగతి తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అలర్ట్. చివరి మూడేళ్లలో 63% ఈక్విటీ ఫండ్స్ వాటి బెంచ్‌మార్క్ సూచీల్ని మించి రాబడి ఇవ్వడంలో విఫలమయ్యాయి. 213 ఫండ్స్‌లో 135 అండర్ పెర్ఫామ్ చేశాయి. 78 మాత్రమే మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో 80%, స్మాల్ క్యాప్‌లో 74, ఫ్లెక్సీ క్యాప్‌లో 69, ఫోకస్డ్‌లో 67, లార్జ్ క్యాప్‌లో 64, ELSSలో 56, మల్టీ క్యాప్‌లో 56, వాల్యూలో 19% ఫండ్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి.
Similar News
News September 13, 2024
బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
కమర్షియల్ రియల్ ఎస్టేట్ (CRE) ప్రాజెక్టులకు బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వడం ఆందోళనకరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. షార్ట్ సెల్లర్లకు ఇది లక్ష్యంగా మారొచ్చని హెచ్చరించారు. ‘లోన్‌బుక్స్‌లో అధిక CRE రేషియో వల్ల అంచనా వేయగలిగే, వేయలేని CRE నష్టాలతో బ్యాంకులకు ఇబ్బందే. వీటితో లిక్విడిటీ ఆగిపోతే షార్ట్ సెల్లర్లు టార్గెట్ చేస్తారు. దాంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మరింత తగ్గుతుంది’ అని అన్నారు.
News September 13, 2024
‘మత్తు వదలరా-2’ సినిమా రివ్యూ
మర్డర్ కేసులో ఇరుక్కున్న హీరో, అతని ఫ్రెండ్ ఎలా దాని నుంచి బయటపడ్డారనేదే స్టోరీ. తన కామెడీ టైమింగ్‌తో సత్య ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. స్క్రీన్ ప్లే, BGM ఆకట్టుకుంటుంది. శ్రీసింహా నటన, వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు ప్లస్ పాయింట్లు. సాగదీత సీన్లు, రొటీన్ అంశాలు మైనస్. డైరెక్టర్ కామెడీపై పెట్టిన ఫోకస్ ఇంకాస్త స్టోరీపై పెట్టుంటే బాగుండేది. కామెడీని ఇష్టపడే వారికి నచ్చుతుంది. రేటింగ్ 2.5/5.
News September 13, 2024
టీమ్‌ఇండియా ప్రాక్టీస్.. జట్టుతో చేరిన కొత్త బౌలింగ్ కోచ్
బంగ్లాదేశ్‌తో ఈనెల 19 నుంచి చెన్నైలో జరిగే తొలి టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. కోచ్ గౌతమ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. కొత్త బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్ కూడా జట్టులో చేరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈనెల 19-23 వరకు తొలి టెస్ట్, ఈనెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్ట్ జరగనుంది.